Monday, 2 November 2026

నెక్లెస్‌ రోడ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ : నగర కకమిషనరేట్‌ పరిధిలో నేటి నుంచి కానిస్టేబుళ్ల నియామక పరుగు పందెం పోటీల కారణంగా నెక్లెస్‌ రోడ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 4 గంటల నుంచి 11.30 వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం నడక కోసం వచ్చేవారికి అనుమతి లేదని చెప్పారు. నేటి నుంచి ఈ నెల 11 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. దరఖాస్తు స్వీకరణకు తుదిగడువైన  మార్చి 16 తర్వాత మరో విడత పరుడుపందెం ఉంటుందని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఆడుగడుగునా వైద్యసిబ్బందిని ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *