Tuesday, 3 November 2026

నేటి నుంచి విద్యుత్‌ కోతలు అమలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో నేటి నుంచి విద్యుత్‌ కోతలు అమలులోక రానున్నాయి. హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో 2 గంటలు, జిల్లా కేంద్రాల్లో 4 గంటలు, పురపాలక పట్టణాల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, గ్రామాలోల 12 గంటలపాటు విద్యుత్‌ కోతలు అమలు కానున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో  ఉదయం ఎనిమిది నుంచి పదిగంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు వరకు కోతలు విధించనున్నారు. మున్సిపాలిటీల్లో ఉదయం 8 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు, మండల కేంద్రాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు విద్యుత్‌ కోతలు అమలు చేయనున్నారు. గ్రామాల్లో వ్యవసాయానికి రెండు విడతల్లో ఏడు గంటలపాటు ఇచ్చే విద్యుత్‌ పగటిపూట ఇస్తే ఆయా గ్రామాల్లో ఆ వారం రోజులు పగటి విద్యుత్‌ ఏడుగంటలు మాత్రమే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *