హైదరాబాద్, (మార్చి, 11): ఎల్బీనగర్‌లోని ఆటోనగర్‌లో నెక్ ఆఫీసుపై కోళ్ల ఫారాల రైతులు దాడి చేశారు. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఆఫీసు అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. దళారులు కోళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు అమ్మకుంటున్నారని ఈ సందర్భంగా రైతులు ఆరోపించారు. ఫలితంగా తామంతా నష్టపోతున్నామని ఆవేదన చెందారు.




