హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దళితులకు సరైన ప్రాధాన్యం కల్పించలేదని ఆరోపిస్తూ కులవివక్ష పోరాట సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.




