Thursday, 5 November 2026

నెన్నెలలో ప్రజావాణి.

ఫొటో : దరఖాస్తులు స్వీకరిస్తున్న ఆర్డీఓ.
నెన్నెల, జనవరి 23, (జనంసాక్షి )
నెన్నెల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల ప్రతేక అధికారి బెల్లంపల్లి ఆర్డివో శ్యామల దేవి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని పలు సమస్యలపై దరఖాస్తు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని ఏ శాఖలో అయినా సమస్యలు ఉంటే ప్రజావాణిలో పిర్యాదు చేసి సమస్య పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీఓ వరలక్ష్మి, ఏపీఎం విజయలక్ష్మి, ఏపీవో నరేష్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.