వినతి పత్రం ఇచ్చిన ఎమ్మార్వో సిపిఎం మండల కన్వీనర్ విద్యసాగర్ జనం సాక్షి జోగుపేట ఆందోల్ పెరిగిన ఫర్టిలైజర్ ఎరువులు పెట్టుబడి ఖర్చులను అనుకూలంగా మద్దతు ధర చెల్లించాలి పత్తి రైతులు ఆదుకొని పత్తి కనీస మద్దతు ధర 12 వేల రూపాయలు చెల్లించాలని సిపిఎం ఆందోల్ మండల కన్వీనర్ డి విద్యాసాగర్ అన్నారు రైతులతో కలిసి జోగుపేట ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి ఎమ్మార్వో వినతి పత్రం సమర్పించారు విద్యాసాగర్ మాట్లాడుతూ వర్ష పరిస్థితుల దృష్టి దిగుబడి తగ్గి పెట్టుబడి ఖర్చులు పెరిగి రైతులు త్రివంగ నష్టపోతున్నారని క్వింటాల్‌కు 12 వేల రూపాయలు చెల్లించి రైతన్న ఆదుకోవాలని అన్నారు పెరిగిన ఎరువులు ధరలు ఫర్టిలైజర్ పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగాయి గత సంవత్సరము 12000 నుండి 13వేల ధర ఉండటంతో రైతులు అధికంగా పత్తి వైపు మొగ్గుచూపి పండ్లు పండించినారు పెట్టుబడి ఖర్చులు పెరిగి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు పంట చేతికి వచ్చే సమయానికి విపరీతంగా వర్షాలు పడి దిగుబడి పూర్తిగా తగ్గిందని తక్షణమే పత్తి రైతులకు క్వింటాల్‌కు 12000 చెల్లించి రైతులను ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు నరేందర్ భూమయ్య రాములు పోచయ్య బాలయ్య సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
పత్తికి కనీసం మద్దతు ధర 12 వేల రూపాయలు చెల్లించాలి




