Monday, 2 November 2026

నెన్నెలలో ప్రజావాణి

నెన్నెల, ఫిబ్రవరి 27, (జనంసాక్షి )
నెన్నెల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి బెల్లంపల్లి ఆర్డివో శ్యామల దేవి హాజరయ్యారు. మండలంలో ఏ సమస్య ఉన్నా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేస్తామని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సంబంధిత అధికారులకు, సలహాలు సూచనలు అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ సంతోషం రమాదేవి, ఎంపీడీఓ వరలక్ష్మి, తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో నరేష్, ఏఈఓ రాంచందర్, ఏపీఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.