నేటినుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌

పారిస్‌ : ఈరోజు నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నమెంటు ప్రారంభం కాబోతోంది. ఎనిమిదోసారి ఫ్రెంచ్‌ టైటిల్‌ సాధించడానికి నాదల్‌కి ఈసారి జకోవిచ్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తున్నారు. క్లేకోర్టుపై సాగే ఈ టోర్నీలో భారత్‌ తరపున పాల్గొంటున్న ఏకైన క్రీడాకారుడు సోమ్‌దేవ్‌.