48గంటల వరకు ర్యాలీలకు అనుమతి లేదు
92 మంది పోలీసు అధికారుల సస్పెన్షన్ ఫేక్ న్యూస్
వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్
హైదరాబాద్,డిసెంబర3 (జనంసాక్షి) : శుక్రవారం జరిగే గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చూస్తున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. 15 కౌంటర్ సెంటర్లు వద్ద కౌంటింగ్ పక్రియ ఉంటుందని అన్నారు. కౌంటింగ్ సెంటర్లు వద్ద 200 విూటర్లు దూరం వరకు ఎవరిని అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కేవలం అనుమతిపత్రం ఉన్న వారికే మాత్రమే కౌంటింగ్ సెంటర్ దగ్గరకు అనుమతి ఇస్తాము అందరూ కూడా పోలుసులకు సహకరించాలని కోరారు. 48 గంటల వరకు రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదని అంజనీకుమార్ తెలిపారు. ఇకపోతే పోలీసు అధికారులపై సస్పెన్షన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఖండించారు. అది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఇలా తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ఒకేరోజు 92 మంది పోలీసు అధికారుల సస్పెన్షన్ అంటూ సోషల్ విూడియాలో ప్రచారం చేస్తున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారిని చెప్పారు. ఒకే రోజు 92 మంది పోలీసులుపై సీపీ చర్యలు తీసుకున్నారనే ప్రచారం అవాస్తవమని తెలిపారు. ఓల్డ్ మలక్‌పేట్‌లో 25 పోలింగ్ లొకేషన్‌లో, 69 పోలింగ్ స్టేషన్‌లో రీ పోలింగ్ జరుగుతోందని హైదరాబాద్ సీపీ తెలిపారు. 64 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారని.. ఇప్పటి వరకు 19 శాతం పోలింగ్ పూర్తి అయిందని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలుపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.
నేటి కౌంటింగ్‌కు భారీగా భద్రతా ఏర్పాట్లు




