Tuesday, 3 November 2026

నేటి నీట్‌ పరీక్షకు భారీగా ఏర్పాట్లు

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 75
CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 75

హైదరాబాద్‌,మే4(జ‌నంసాక్షి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్యవిద్య కోర్సుల్లో 2019-20 సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈనెల 5వ తేదీన ఆదివారం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌  జరగనుంది. వచ్చే నెల 5న నీట్‌ ఫలితాలు వెల్లడవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మొత్తం ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు జాతీయ విద్యామండలి ఎన్‌టీఏ అధికారులు
ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నుంచి ఈ ఏడాది సుమారు లక్షకు పైగా పరీక్షకు హాజరవుతున్నట్లు అంచనా. ఎప్పటిలాగే ఈసారి కూడా నీట్‌ నిర్వహణలో కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోని ఏ వస్తువులు తీసుకు రాకూడదు? ఎలాంటి దుస్తులు ధరించాలి? తదితర అంశాలపైనా జాతీయ విద్యామండలి స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. మధుమేహులకు మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రం లోపలకు అనుమతించరు. పరీక్షను మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ నిర్వహిస్తారు. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న ఆదివారం దేశవ్యాప్తంగా ‘నీట్‌’ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ‘నీట్‌’లో అవకాశం కోల్పోయి ఆయుష్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థులు కూడా మళ్లీ ప్రయత్నిద్దామన్న ఆశతో ఉన్నారు. వారి ఆశలపై కాళోజీ విశ్వవిద్యాలయం నీళ్లు చల్లింది. ¬మియోపతి ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లమెంటరీ ప్రాక్టికల్స్‌ పరీక్షలను ఆదివారం నిర్వహిస్తోంది. దాంతో రెండు పరీక్షల్లో ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.