పంజాగుట్ట: మొదటిసారిగా నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో అసోసియేషన్ ఆఫ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉద్యానవన, వ్యవసాయ ప్రదర్శన జరగనుంది. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు ఖాలీద్ అహ్మద్ వివరాలు వెల్లడించారు. నేటి నుంచి 11వ తేదీ వరకు జరిగే ప్రదర్శనలో దేశంలో ఉద్యానవన, వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులు కొలువుదీరుతాయన్నారు. ఆలిండియా ప్రదర్శనలో దేశవ్యాప్తంగా డార్జిలింగ్, కోల్‌కత్తా, ముంబాయి, బెంగళూరు, తెలంగాణతో పాటు ఏపీ రాష్ర్టాలకు చెందిన నర్సరీలు పాల్గొంటాయని ఆయన తెలిపారు.




