హైదరాబాద్ సిటీ : ప్రపంచ రొమ్ము కేన్సర్ అవగాహన మాసాన్ని పురస్కరించుకొని కేన్సర్ స్ర్కీనింగ్ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సక్సెనా ఆస్పత్రి డైరెక్టర్ మోనిక తెలిపారు. ఈనెల 11న బషీర్‌బాగ్‌లోని తమ ఆస్పత్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. రొమ్ము కేన్సర్‌ను ముందుగానే గుర్తించే ‘థైర్మోస్కాన్’ ఆధునిక వైద్య పరికరం ద్వారా స్ర్కీనింగ్ చేస్తామని ఆమె తెలిపారు. ముందుగా కేన్సర్‌ను గుర్తించినట్లయితే ప్రాథమిక దశలోనే దాన్ని నియంత్రించే అవకాశముందన్నారు. అలాగే ప్రాథమిక దశలో మధుమేహంతో బాధపడే వారికి గ్యాంగ్రిన్, పాదాలకు సంబంధించిన సమస్యలను ఈ పరికరం ద్వారా గుర్తించే వీలుందన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 10 లోగా తమ పేర్లను ఉచితంగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. వివరాలకు 040- 66 752014, 9849017813 నంబర్లలో సంప్రదించాలని సూచించారు




