హౖదరాబాద్ అంతర్ కళాశాలల స్కూల్‌గేమ్స్ సమాఖ్య అండర్-19 స్విమ్మింగ్, టెన్నిస్ సెలెక్షన్ ట్రయల్స్ బుధవారం జరగనున్నాయి. సికింద్రాబాద్‌లోని ఎంసీహెచ్ స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్మింగ్ పోటీలు, రైల్ నిలయంలోని ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్స్ వేదికగా టెన్నిస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా అండర్-19 పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో బాలబాలికల విభాగాల్లో జరిగే ఈ సెలెక్షన్స్‌లో విజేతలు రంగారెడ్డి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆసక్తిగల క్రీడాకారులు వేదిక వద్ద ఉదయం 9 గంటలకు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి హనుమంత రెడ్డి (98490 86799)కి రిపోర్ట్ చేయాలి.




