సికింద్రాబాద్: వేసవిలో ప్రయాణించే వారికి రటగా నిలిచేలా సికింద్రాబాద్ మీదుగా 34 ప్రత్యేక రైళ్లను ద.మ. రైల్వే ప్రకటించింది. విశాఖ – నాందేడ్‌ల మధ్య వీటిని నడపనున్నారు. ఈ నెల 5 నుంచి జూన్ 26వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ద.మ. రైల్వే సీపీఆర్వో కె. సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు.
– నెంబరు 08509 ప్రత్యేక రైళ్లు విశాఖ నుంచి మార్చి 5,12,19,26, ఏప్రిల్ 2,9,16,23,30, మే 7, 14, 21, 28, జూన్ 4,11,18,25 తేదీల్లో (మంగళవారాల్లో) సాయంత్రం 7.30 గంటలకు బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 2.35 గంటలను నాందేడ్ చురుతాయి.
– నెంబరు 08510 ప్రత్యేక రైళ్లు నాందేడ్ నుంచి మార్చి 6, 13, 20, 27, ఏప్రిల్ 3, 10, 17, 24, మే 1,8, 15, 22, 29 జూన్ 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 10.15 గంటలకు విశాఖ చేరుతాయి.
– ఈ ప్రత్యేక రైళ్లకు రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, కాజీపేట్, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్కేడ్ స్టేషన్లలో హాల్టు సదుపాయాన్ని కల్పిస్తారు.
తిరుపతి- కరీంనగర్‌ల మధ్య..
తిరుపతి నుంచి నెంబరు 02761 ప్రత్యేక రైలు మార్చి 6వ తేదీ రాత్రి 10.40 గంటలకు బయలుదేరి మర్నడు ఉదయం 11.25 గంటలకు కరీంనగర్ చేరుతుంది. కరీంనగర్ నుంచి నెంబరు 02762 ప్రత్యేక రైలు మార్చి 7వ తేదీ రాత్రి 7.10 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 7.55 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, విజయవాడ, మధిర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి స్టేషన్లలో ఆగుతుంది.




