Tuesday, 3 November 2026

నేటి నుంచి స్థాయీసంఘాలపై అవగాహన తరగతులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థాయీసంఘాల ఏర్పాటు నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేటి నుంచి అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. పంజాబ్‌ గవర్నర్‌, లోక్‌ సభ మాజీ సభావతి శివరాజ్‌పాటిల్‌ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇటీవల ఆధునీకరించిన అసెంబ్లీ పాత భవనంలో జరిగే ఈ కార్యక్రమంలో పాటిల్‌తోపాటు గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు. పాటిల్‌ లోక్‌సభ సభాపతిగా ఉన్నప్పుడు స్థాయీ సంఘాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వాటి ఆవశ్యకత, పనితీరును ఆయన సభ్యులకు వివరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *