హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో విచారణ నిమిత్తం తీహర్ జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన మక్బూల్, ఇమ్రాన్‌ఖాన్‌లను ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్‌ఐఏ అధికారులు భారీ బందోబస్తు మధ్య తరలించారు. ఐదు రోజుల కస్టడీ నేటితో పూర్తి కానున్న నేపథ్యంలో వీరిద్దరిని ఢిల్లీకి తరలించి కోర్టులో హాజరుపరుచనున్నారు. ఎన్‌ఐఏ కార్యాలయంలో వీరిని 4 రోజులపాటు విచారించిన విషయం తెలిసిందే.




