Monday, 2 November 2026

నేటి నుండి తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో బస్తీ బాట 

నేటి నుండి తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో బస్తీ బాట
-తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్
యైటీంక్లయిన్ కాలని ఏఫ్రిల్ 01 (జనం సాక్షి) :నేటి నుండి బస్తీ బాట, పల్లె బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ పేర్కొన్నారు. శనివారం ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపటి నుండి  8 ఇంక్లైన్ కాలనీ  మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి డివిజన్లో బస్సు బాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు సంబంధించిన సమస్యలను తెలుసుకొని ప్రజలకు సంబంధించిన సమస్యలైన రోడ్ల సౌకర్యంగాని, వితంతు పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్, వికలాంగుల పెన్షన్, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అమలు తీరు, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, దళిత బంధు, రైతుబంధు తదితర అంశాలకు సంబంధించి ప్రజల నుండి సమస్యలు సేకరించి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా స్థానిక ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను కలిసి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ లేబర్ పార్టీ కృషి చేస్తుందన్నారు.  ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న ప్రజల సమస్యలు విస్మరిస్తున్నాయన్నారు.  50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ 8 ఏళ్ల పాలిస్తున్న టిఆర్ఎస్ ప్రజల సమస్యలను పట్టించుకోలేదు, ఓట్లప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నారని కానీ వాటిని ప్రభుత్వ అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గాని ఖర్చు పెట్టకుండా చేస్తున్నారన్నారు.  వీటికి సంబంధించి ప్రభుత్వ అధికారులను ముఖ్యంగా కలెక్టర్ గారిని మున్సిపల్ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి గారిని పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ ని అవసరమైతే ముఖ్యమంత్రిని కలిసి ఈ సమస్యల పరిష్కారం కోసం  నెరవేర్చాలని కోరుతూ విజ్ఞాపన పత్రాలు అందజేస్తామన్నారు.  ఒకవేళ ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాప్రతిని గాని స్పందించకపోతే సంబంధిత అధికారుల కార్యాలయం ముందు ధర్నాలు, దీక్షలు తెలంగాణ లేబర్ ద్వారా చేపడతామని తెలిపారు.  నిజాంబాద్ మెడికల్ కాలేజీలో చనిపోయినటువంటి రాకేష్ ఆత్మహత్యపై సిబిసిఐడి విచారణ చేయవలసిందిగా తెలంగాణ లేబర్ పార్టీ నుండి డిమాండ్ చేశారు.  మెడికల్ కాలేజీలో ఇప్పటివరకు ముగ్గురు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు వారి ఆత్మహత్యలపై సి వి సి ఐ డి విచారణ చేసి ఆత్మహత్యలకు జరగడానికి గల కారణాలను చేసి తగిన విచారణ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ విలేకరుల సమావేశంలో అల్లిపు తిరుపతి,  సాయి తేజ, ఇరుగురాల సంతోష్, జక్కం కవిత,  కొయ్యల శివరాం, జై. అఖిల్ వర్మ, గుండ్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు.