Monday, 2 November 2026

బదిలీపై వెళ్తున్న ప్రభుత్వం ఉపాధ్యాయుడికి సన్మానం

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్ల గ్రామంలోని జడ్పీ హై స్కూల్ లో హిందీ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ఎండి సర్వర్ బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో వారిని కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు ఆధ్వర్యంలో శనివారం పూలమాలవేసి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ మారం శ్రీనివాస్, పాఠశాల కరస్పాండెంట్లు సుజాత, సునీత దేవి,చంద్రయ్య, టీచర్స్, బాలశువ్ రెడ్డి, శ్రీనివాస్, వెంకట్ నారాయణ, రాధిక,లలిత,వసుందర అన్నపూర్ణ, ఆశలత, సరోజన,అరుణ, తదితరులు పాల్గొన్నారు.