Wednesday, 4 November 2026

నేటి నుండి నగరంలో ‘స్మర్ కార్నివాల్’ సందడి

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మర్ కార్నివాల్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఐదేళ్ల నుంచి ఏటా మే ఒకటవ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ సమ్మర్ కార్నివాల్ నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే, ఈ ఏడాది 9వ తేదీ నుంచి 31 వరకు కొనసాగనుంది. ఇందులో ఎయిర్ గేమ్స్, హార్స్ రైడింగ్, ఫుడ్‌కోర్ట్‌తోపాటు పిల్లలను అలరించేందుకు అమ్యూజ్‌మెంట్, మణిపూర్ కళాకారులతో ఆఫ్రికన్ జమున సర్కస్‌ను కూడా ఏర్పాటు చేశారు. కాగా, 10 రూపాయల ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మినీ ట్రెయిన్‌లో మాత్రం ఉచితంగా తిరిగేందుకు అవకాశం కల్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *