విశాఖ: స్టీల్‌ప్లాంట్‌లో తాజాగా విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌లో నిర్వాసితులకు అవకాశం లేకపోవడంపై ఐఎన్‌టీయూసీ, మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగాల భర్తీ కోసం చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తూ స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం దగ్గర ఆందోళన చేస్తున్నారు.




