నేడు అలంపూర్ కు బిఎస్పీ అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాక
అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 30)బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్బంగా నవంబర్ 21తేది న అలంపూర్ బిఎస్పి నాయకులు ఐజ నుండి అలంపూర్ వరకు ప్రజల సమస్యలు తెలుసు కునేందు పాదయాత్ర చేపట్టారు.ఈ పాదయాత్ర డిసెంబర్ 1తేదిన అలంపూర్ లో ముగింపు ఉండటం తో ముగింపు కార్యక్రమనికి బిఎస్పీ అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రానున్నట్లు అలంపూర్ తాలూకు అధ్యక్షులు మహేష్ బుధవారం ఒకప్రకటన లో తెలిపారు.కావున ఈ పాదయాత్ర ముగింపు కార్యక్రమనికి అధిక సంఖ్యలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలనీ మహేష్ పిలుపు నిచ్చారు.
నేడు అలంపూర్ కు బిఎస్పీ అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాక




