Thursday, 5 November 2026

బాధితులను రక్షించేందుకు సహాయచర్యలు – హోంశాఖమంత్రి

తూర్పుగోదావరి, సెప్టెంబరు 14 : గండేపల్లి దగ్గర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర హోంశాఖమంత్రి చినరాజప్ప అధికారులతో మాట్లాడారు. ఈ ప్రమాదంలో బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు వేగవంతం చేశారు. జేసీబీ సాయంతో క్వారీ బూడిదను తొలగించి 16 మందిని పోలీసులు రక్షించారు. రోడ్డు ప్రమాదం నుంచి గాయాలతో కొంతమంది బయటపడ్డారు. గాయపడిన వారిలో మొగలి సత్తిబాబు, కుడిగట్ల శివ, దాడిచెట్టి రాంబాబు, గట్టెం సూరిబాబు, పల్లా సత్తిబాబు, ఈగల సూర్యచంద్రరావు, కరణం దాసు, ఈగల శివ, గూడి అప్పారావు, గొల్లం మణికంఠలున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *