Tuesday, 3 November 2026

నేడు ఎన్టీఆర్ 20వ వర్థంతి

హైదరాబాద్ : నేడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 20వ వర్ధంతి. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయనకు కుటుంబసభ్యులు నందమూరి హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ తదితరులు నివాళులు అర్పించారు. సినీ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి కూడా ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ… ఎన్టీఆర్‌ నిరంతరం పేదల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. గ్రామాలకు రహదారులు, బస్సు సౌకర్యాలు కల్పించింది ఎన్టీఆర్‌ హయాంలోనే అని ఆయన గుర్తు చేశారు. ‘నాన్నకు ప్రేమతో’ తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *