హైదరాబాద్ : ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌ను ప్రభుత్వ సిటీ కాలేజీలో గురువారం మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 వరకు హైదరాబాద్ జిల్లా యువజన సంక్షేమాధికారి మోతీలాల్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన 18-35 సంవత్సరాల వయస్సు గల యువత ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు పలు సూచనలు ఇవ్వడంతో పాటు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.




