ఏర్పాట్లలో తెలుగు తమ్ముళ్లు బిజీ
కరీంనగర్,మార్చి2(జనంసాక్షి): రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం అధినేత ¬దాలో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కరీంనగర్‌కు వస్తున్నారు. ఈ మేరకు టిడిపి ఏర్పాట్టు పూర్తి చేసింది. అయితే వర్ష సూచన ఉండడంతో అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాట్లు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఏడాది దాటిన తర్వాత వస్తున్న అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలకాలని.. ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ ప్రకటించింది. వరగంల్‌లో అడ్డున్నట్లుగానే ఇక్కడా అడ్డుకుంటామని అన్నారు. చంద్రబాబుకు పోటీగా మూడో తేదీనే కరీంనగర్‌లోనే నిరసన సభ నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ ప్రకటించారు. అయితే ఎమ్మార్పీఎస్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా వర్గీకరణపై చంద్రబాబు వైఖరి తేల్చాలంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలు… భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసేందుకు బాబు నియోజకవర్గాలవారీగా సవిూక్షలు నిర్వహించనున్నారు. అందుకే ఇక్కడ సభ ఏర్పాటు చేశారు. టిడిపి అధ్యక్షుడు రమణ, ఎరరబెల్లి, రేవంత్ రెడ్డి తదితరలుఉ ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా 3న కరీంనగర్‌లో జరిగే ప్రతినిధుల సమావేశంలో 13 నియోజకవర్గాల కార్యకర్తలు, పార్టీ ముఖ్యులతో కలిసి చర్చిస్తారని తెదేపా జిల్లా అధ్యక్షుడు విజయరమణరావు తెలిపారు. 3న ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని రాజీవ్‌గృహకల్ప స్థలంలో దిగుతారని చెప్పారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 12.30 గంటలకు అంబేడ్కర్ స్టేడియం చేరుకుంటారు. జిల్లాలో ఇటీవల చేసిన సభ్యత్వంలో 72 వేల క్రియాశీలక సభ్యత్వం చేసినట్లు చెప్పారు. ఈ ప్రతినిధుల సభకు రావాలని వారందరికీ సంక్షిప్త సమాచార సందేశం పంపించినట్లు తెలిపారు. ముందుగా జిల్లా ప్రతినిధుల సభ 35 వేల పైచిలుకు మందితో జరుగుతుందని అన్నారు. అనంతరం ఒక్కో నియోజకవర్గ పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలతో చంద్రబాబునాయుడు చర్చిస్తారు. 4న ఉదయం బాబు తిరిగి హైదరాబాద్ వెళ్తారు. ఈ పర్యటనలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అధిగమిస్తామని ఆయన చెప్పారు. దీనికి తోడు సభకు జనసవిూకరణ చేస్తున్నారు.




