Tuesday, 3 November 2026

నేడు కలాల కవాతు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు సీమాంధ్ర సర్కారు పన్నుతున్న కుట్రలపై ఎగరేసిన బావుటా! తెలంగాణ ఆత్మగౌరవం కోసం కలాలు చేపడుతున్న కవాతు! అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ప్రసంగ కార్యక్షికమానికి తెలంగాణ మీడియా పింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌) అనుమతించకుండా అవబానించిన తీరుకు నిరసనగా కలం విప్పనున్న గళం! తెలంగాణ జర్నలిస్టుల కలం కవాతు.. నేడే! మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాదలోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్‌ నుంచి .. ఇందిరాపార్క్‌ దాకా తెలంగాణ జర్నలిస్టులు కదం తొక్కనున్నారు. మేముసైతం అంటూ వివిధ తెలంగాణ  సంఘాలు, జేఏసీలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో కలాల కవాతు.. నగరాన్ని హూరెత్తించనుంది! తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్వర్యంలో మంగళవారం జరిగే కలం కవాతుకు తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక సంఘాలతో పాటు టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్షికసీ పార్టీలు, తెలంగాణ ప్రజావూఫంట్‌, తెలంగాణ మాల మహానాడు. తెలంగాణ మహిళా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్షికమంలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం, కన్వీనర్‌ స్వామిగౌడ్‌, టీజేఎఫ్‌ అధ్యక్షుడు అల్లం నారాయణ. ప్రధాన కార్యదర్శి క్రాంతి, టీజేఎఫ్‌ నాయకుడు పల్లె రవి, టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈ టెల రాజేందర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలంగాణ ప్రజావూఫంట్‌ నేతలు ఆకుల భూమయ్య వేదకుమార్‌, న్యూడెమోక్షికసీ నేతలు సూర్యం, గోవర్థన్‌, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్‌రావు. శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌ తదితరులు పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *