Monday, 2 November 2026

నేడు కేకే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం వెంటనే ప్రకటించాలంటూ రాజీనామా అస్త్రాలతో అధిష్ఠానం మీద ఒత్తిడి తీసుకువస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈరోజు ఉదయం 10 గంటలకు మాజీ ఎంపీ కేకే నివాసంలో సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే రాజీనామాలకు వెనకాడబోమని వారు మరోమారు అధిష్ఠానానికి స్పష్టం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల తరపున అధిష్ఠానానికి లేఖను తీసుకువెళ్లిన్న ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, రాజయ్యలు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *