Monday, 2 November 2026

నేడు జైళ్ల శాఖ సైకిల్‌ ర్యాలీ

హైదరాబాద్‌: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవినీతిని రూపుమాపాలనే పిలుపుతో తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చార్మినార్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు సైకిల్‌ ర్యాలీ తలపెట్టింది. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు చార్మినార్‌ వద్ద సైకిల్‌ ర్యాలీని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. అవినీతి రహిత శాఖగా దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ జైళ్ల శాఖ రూపుదిద్దుకున్న విషయాన్ని సైకిల్‌ ర్యాలీ ద్వారా చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నతాధికారులు. అంతే కాకుండా ఇంధనంతో వా హనాల్ని ఉపయోగించడానికి బదులు పర్యావరణానికి హాని కలిగించకుండా సైకిల్‌ ఉపయోగించే విధంగా, క్రీడలకు ప్రాధాన్యం పెరగాలనే అంశాన్ని కూడా సైకిల్‌ ర్యాలీతో చాటిచెప్పనున్నారు. జైళ్ల శాఖలోని అధికారులు, సిబ్బందిలో 12 మంది స్వచ్ఛందంగా సైకిల్‌ ర్యాలీలో పాల్గొనేందుకు ముందుకు వచ్చినట్లు డీజీ వీకేసింగ్‌ తెలిపారు. పలు సరికొత్త సంస్కరణలతో ముందుకు సాగుతున్న జైళ్ల శాఖ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తుందని డీజీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *