Monday, 2 November 2026

హెల్మెట్‌ వాడకంపై అవగాహన కార్యక్రమాలు : జేటీసీ

హెల్మెట్‌ వాడకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హైదరాబాద్‌ జిల్లా సంయుక్త రవాణా కమిషనర్‌ టి. రఘునాథ్‌ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించేలా చైతన్యం చేయాల్సిన బాధ్యత రవాణా శాఖపై ఉందన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శితో మంగళవారం సమావేశం జరిగిందన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల రవాణా శాఖల అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇందులో భాగంగానే నగరంలో ఉన్న ద్విచక్ర వాహన డీలర్లతో కలిసి వాహన ర్యాలీ, ప్రచార చిత్రాలు వేయించనున్నామని తెలిపారు. పెట్రోల్‌ బంకుల్లోనూ హెఎ్మట్‌ వాడాలని సూచిస్తూ హోర్డింగులు ఏర్పాటు చేసేలా రవాణా శాఖ ఆయా కంపెనీలతో చర్చలు జరుపుతోందన్నారు. హెల్మెట్‌ పెట్టుకొని వస్తేనే ద్విచక్రవాహనదారులను ఆర్టీఏ కార్యాలయాల్లోకి అనుమతిస్తున్నామని ఆయన చెప్పారు. హెల్మెట్‌ వాడకంపై కఠినంగా వ్యవహరించాలని తమకు ఆదేశాలు ఉన్నాయని, దీనిపై అధికారులందరూ నిరంతరం పనిచేస్తారని జేటీసీ రఘునాథ్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *