గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి
తూర్పుగోదావరి : అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీలోని రాజమండ్రిలోని గోదావరికి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. దవళేశ్వరం వద్ద 8 అడుగులకు నీటిమట్టం చేరుకోవడంతో…2 లక్షల క్యూసెక్కుల నీరును సముద్రంలోకి విడుదల చేశారు.