హైదరాబాద్,ఏప్రిల్2(జనంసాక్షి): జాతీయస్థాయిలో ఈనెల 3వ తేదీ ఆదివారం నిర్వహించనున్న జేఈఈ మెయిన్ పరీక్ష కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది ఈ పరీక్ష రాయనుండగా తెలుగు రాష్టాల్ర నుంచి 1.17 లక్షల మంది హాజరుకానున్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో పరీక్ష జరగనుంది. ప్రతిష్ఠాత్మక ఎన్‌ఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి, ఐఐటీ అడ్వాన్సుడ్ పరీక్షకు అర్హత పొందేందుకు జెఈఈ తప్పనిసరి కావడంతో విద్యార్థులు దీనికి సిద్దమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో 55,950 మంది, ఏపీలో 61,171 మంది పరీక్షకు దరఖాస్తు చేశారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన 2 లక్షల మంది ఐఐటీ అడ్వాన్సుడ్ పరీక్ష రాసేందుకు అర్హులవుతారు. ఏప్రిల్ 9, 10న జరిగే జేఈఈ మెయిన్‌ఆన్‌లైన్ పరీక్షకు ఏపీలో 14,760 మంది, తెలంగాణలో 5,988 మంది హాజరుకానున్నారు.ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే పేపర్-1 పరీక్షకు 7 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. 9.30 గంటల తర్వాత అభ్యర్థులను లోపలికి అనుమతించేది లేదని సీబీఎస్‌ఈ పేర్కొంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్-2 (బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సులకు)పరీక్షకు ఒంటి గంట నుంచి లోపలికి పంపిస్తారు. పరీక్ష కేంద్రంలోకి హాల్‌టికెట్మాత్రమే తీసుకొని రావాలని అధికారులు సూచించారు. ఎలక్టాన్రిక్ పరికరాలే కాకుండా చేతి గడియారం, కలాన్ని కూడా అనుమతించరు. బూట్లు కూడా వేసుకొని రావడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చిన గది బయట వదిలి వెళ్లాలి.




