Monday, 2 November 2026

నేడు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌

, హైదరాబాద్‌ సిటీ : కృష్ణా రెండో దశలోని రింగ్‌ మెయిన్‌-1 నిర్వహణ పనుల నిమిత్తం బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపేస్తున్నట్లు వాటర్‌బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. సాహెబ్‌నగర్‌ నుంచి మైలార్‌దేవ్‌పల్లి పంపింగ్‌ స్టేషన్‌ స్ర్టెచ్‌లోని 1600 ఎంఎం డయా పైపులైన్‌లో మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో రాజీవ్‌గృహకల్ప, బాలాపూర్‌ ఏఆర్‌ సీఐ, బాబానగర్‌, పిసలబండ, రియాసత్‌నగర్‌, మొయున్‌బాగ్‌, ఫతేషా నగర్‌, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, మిధాని, డీఆర్‌డీఎల్‌, ఆర్‌సీఐ, సీఆర్‌పీఎఫ్‌, ఉప్పుగూడ, సాయిబాబానగర్‌, శివాజీనగర్‌, లలిత్‌బాగ్‌, జీఎం నగర్‌ ప్రాంతాల్లో సరఫరా ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *