Monday, 2 November 2026

స్మార్ట్‌ సిటీకి ప్రత్యేక వెబ్‌సైట్‌

హైదరాబాద్‌ సిటీ : స్మార్ట్‌ సిటీపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. టాప్‌-5లో చోటు దక్కించుకునేలా ప్రతిపాదిత ప్రణాళికల రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూచనల నేపథ్యంలో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ మై గవర్నమెంట్‌  పేరిట త్వరలో వెబ్‌ పేజీ అందుబాటులోకి వస్తుందని కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ తెలిపారు. స్మార్ట్‌ సిటీ ఎలా ఉండాలి, మౌలిక వసతుల కల్పన, చారిత్రక సంపద పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై పౌరుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. స్మార్ట్‌ సిటీ రూపకల్పనకు గతంలోనే నైట్‌ ఫ్రాంక్‌ కన్సల్టెన్సీని ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 100 నగరాలు పోటీ పడుతున్న నేపథ్యంలో మొదటి విడతగా 20సిటీలను ఎంపిక చేయనున్న విషయం విధితమే. ఎంపికైన సంవత్సరం నుంచి ఏటా రూ.100 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. నవంబర్‌ 25లోపు స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు రిపోర్టును కేంద్రానికి పంపుతామని సోమేష్‌కుమార్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *