Wednesday, 4 November 2026

నేడు పీడీఎస్‌యూ ఛలో హైదరాబాద్‌

హైరదాబాద్‌: వృత్తి విద్యా కోర్సులకు ఫీజు పెంపును నిలిపివేసి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) నేడు ఛలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా బాగ్‌ లింగంపల్లి నుంచి  సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు ప్రదర్శన నిర్వహిస్తామని సంఘం రాష్ట్ర నాయకుడు దయాకర్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిథ యూనివర్శిటీల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *