Tuesday, 3 November 2026

నేడు మన్నెగూడెంలో పౌరహక్కుల దినం.

నెన్నెల, మే 29, ( జనంసాక్షి )
మండలంలో మన్నెగూడెం గ్రామంలో మంగళవారం పౌరహక్కుల దినం జరుపనున్నట్లు తహసీల్దార్ భూమేశ్వర్ తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, పోలీసులు, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, అన్ని మతాల పెద్దలు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరు కావాలన్నారు. ఇట్టి కార్యక్రమంలో అంటరానితనం, అస్పృష్యత నివారణ కోసం అవగాహనా కల్పించనున్నట్లు ఆయన వివరించారు.