జనం సాక్షి/ కొల్చారంరైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కెసిఆర్ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఎంతవరకు సమంజసం అని బిజెపి జిల్లా మోర్చా అధ్యక్షులు రమేష్ గౌడ్, కొల్చారం మండల బిజెపి అధ్యక్షులు పాతూరు దయాకర్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో మెదక్ నర్సాపూర్ ప్రధాన జాతీయ రహదారిపై రైతులతో కలిసి సోమవారం రాస్తారోకో చేశారు. రోడ్డుకు అడ్డంగా కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొల్చారం ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రాస్తారోకో చేస్తున్న వారి దగ్గరికి రాగానే పోలీస్ జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు పాతూరు దయాకర్ రావు మాట్లాడుతూ నిన్న మెదక్ లో మంత్రి హరీష్ రావు జిల్లాలో 70 శాతం వరి దాన్యం కొనుగోలు పూర్తయినట్లు తెలిపారు, కొల్చారం వస్తే తెలిసేదన్నారు. ఇక రైస్ మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారన్నారు. బస్తా నలభై కిలోలకు బదులు 45 కిలోలు కాంటా పెట్టుకుంటున్నారని, ఐదారు రోజుల వరకు ఖాళీ చేయకపోవడంతో తూకం తక్కువ వస్తుందని లారీకి ఐదు నుంచి 10 క్వింటాలు దోచుకుంటున్నారన్నారు. తొందర్లోనే వర్షాలు రానున్నందున ప్రభుత్వం కల్లాల నుంచి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు. రానున్న ఎన్నికల్లో రైతులు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు అన్నారు. ఈ రాస్తారోకోలో రైతులతో పాటు కౌడిపల్లి మండల బిజెపి అధ్యక్షుడు రాకేష్, బిజెపి ప్రధాన కార్యదర్శి రాజేంద్ర గౌడ్, పలువురు బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.
రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు.? బిజెపి జిల్లా మోర్చా అధ్యక్షులు రమేష్ గౌడ్. మండల పార్టీ అధ్యక్షుడు దయాకర్ గౌడ్




