Thursday, 5 November 2026

నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోచెయనా పారిశ్రామికవేత్తల బృందం బ’ాటీ

పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనపై చర్చ

హైదరాబాద్‌: చెయనా పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వేత్తల బృందం శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బ’ాటీ కానుంది. ఫలక్‌నామా ప్యాలస్‌లో సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమావేశం జరుగుతుంది. సానీ, సీసీటీఈజీ, చెయనా మిన్‌పెంగ్‌, చెయనా కోల్‌మైన్‌ కన్‌స్ట్రక్షన్స్‌, పవర్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చెయనా సంస్థలకు చెందిన 45 మంది ప్రతినిధులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వస్తున్నారు. తెలంగాణలో భారీ యంత్రాల పరిశ్రమల స్థాపన, శివారు నగరాల నిర్మాణాలు, నగర మౌలిక వసతులు, బొగ్గు, విద్య తదితర రంగాల్లో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన గురించి చర్చిస్తారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఇటీవల చెయనా పర్యటనకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి ఈ కంపెనీల ప్రతినిధులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపగా, వారిని రాష్ట్రానికి ఆహ్వానించారు. సీఎం ఆహ్వానం మేరకు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పెద్దసంఖ్యలో హైదరాబాద్‌కు వస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *