Thursday, 5 November 2026

భర్త ఫోన్‌ లాగేసుకున్నాడని.. భార్య ఆత్మహత్య

హైదరాబాద్‌: భర్త ఫోన్‌ తన ఫోన్‌ తీసుకున్నాడని నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. వారికి కొత్తగా పెళ్లైంది.. కానీ భార్య ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు అడిక్ట్‌ అయ్యి పూర్తి సమయాన్ని వాటికే వెచ్చిస్తోందని కోపంతో భర్త ఆమె వద్ద నుంచి ఫోన్‌ లాక్కోవడం ఇంతటి దారుణానికి దారితీసింది.ఎప్పుడూ చూసినా ఫోన్‌లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌తో కాలం గడుపుతున్నావంటూ భార్యపై కోప్పడ్డాడు. దీంతో ఇద్దరికీ గొడవ జరిగింది. అతడు భార్య దగ్గరి నుంచి ఫోన్‌ తీసేసుకున్నాడు. దీంతో ఆమె గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకుంది. ఎంత ప్రయత్నించినా తలుపు తెరవలేదు. తలుపు పగలగొట్టి చేసేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంది. భార్య ఆత్మహత్యకు తానే కారణమంటూ భర్త కూడా ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబసభ్యులు అడ్డుకొని కాపాడారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *