నేడు మోదీతో సీఎం కేసీఆర్‌ భేటి

– రాష్టాన్రికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం
హైదరాబాద్‌,అక్టోబర్‌ 3 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్‌ భేటీ అవుతారు. రాష్టాన్రికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. కేంద్రం నుంచి రాష్టాన్రికి వచ్చే నిధులను పెంచడంతోపాటు రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ¬దా ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయప్రాజెక్టు ¬దా కల్పించాలని ఇదివరకే అనేకసార్లు ప్రధానిని సీఎం కోరిన విషయం తెలిసిందే. /ూష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల పూడిక తీసే మిషన్‌ కాకతీయ కార్యక్రమాన్ని నీతిఆయోగ్‌ ప్రశంసించింది. దీనివల్ల తెలంగాణలో భూగర్భజలాలు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. ఈ పథకానికి ఆర్థిక సహాయం అందించాలని గతంలోనే ప్రధానికి సీఎం విజ్ఞప్తిచేశారు. ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించే మిషన్‌ భగీరథ పథకాన్ని స్వయంగా ప్రధానే రాష్టాన్రికి వచ్చి ప్రారంభించారు. ఈ పథకానికి ఆర్థికసాయం అందించాలని నీతి ఆయోగ్‌ కేంద్రానికి సిఫారసు కూడా చేసింది. ఈ రెండు పథకాలకు ఆర్థిక సహాయమివ్వాలని ప్రధానిని ఈ భేటీలో కోరనున్నారు. కంటోన్మెంట్‌ ఏరియాలో రోడ్ల విస్తరణకు భూములు ఇవ్వాలని ఇదివరకే కేంద్రాన్ని సీఎం కోరారు. తాజాగా మరోసారి ఈ భూమిని ఇచ్చే విషయంపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు.

తాజావార్తలు