Wednesday, 4 November 2026

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. బంగారుతల్లి పథకానికి చట్టబద్దత కల్పించడమే అజెండా ఈ సమావేశం జరగనుంది. ఈ పథకానికి చట్టబద్ధత కల్పించడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. మరోవైపు చట్టబద్ధత కల్పించడాన్ని మంత్రులు కె. జానారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి వ్యతిరేకిస్తున్నారు.
ఇందుకోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలోనూ తమ వ్యతిరేకతను వారు వ్యక్తం చేశారు. ఈ తరుణంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ముసాయిదా బిల్లుపై వాడీవేడిగా చర్చజరిగే సూచనలున్నాయి. మరోసారి తమ వ్యతిరేకతను వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా…. ముసాయిదా బిల్లుకు కేబినేట్‌ ఆమోదం లభించే అవకాశముందని అధికార వర్గాల సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *