పెళ్లకూరు: రాష్ట్రంలో ఈ ఏడాది గ్రామీణ రహదారుల కోసం పీఎంజీఎస్‌వై కింద రూ. 2200కోట్లు మంజూరయినట్లు తిరుపతి ఎంపీ చింతా మోహన్ తెలిపారు. సోమవారం నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరులో అభివృద్ధిపనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపాది కూలీ తక్కువ చెల్లించటంపై ఆ పథకం ఏపీఓను నిలదీశారు. వేసవిలో రూ. 224కూలీ చెల్లించాల్సి ఉండగా రూ. 70 ఇవ్వటంపై అగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు రామలింగారెడ్డి, తదితరులున్నారు.




