Wednesday, 4 November 2026

నేడు రిప్పల్స్ పాఠశాల వార్షికోత్సవం

బిచ్కుంద ఏప్రిల్ 08 (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల రిప్పల్స్ పాఠశాలలో నేడు సాయంత్రం 5వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి అనేక విద్యార్థిని విద్యార్థులకు నాణ్యతమైన విద్యను అందిస్తున్నామని, విద్యా కార్యక్రమాలు, క్రీడాంశాలు, మరియు వివిధ కళలలో అత్యున్నత నైపుణ్యాలను ప్రదర్శించడం జరుగోంతదని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు.