బిచ్కుంద ఏప్రిల్ (జనంసాక్షి) బిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నేడు నిర్వహించనున్నామని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాధవరావు దేశాయ్ తెలిపారు. ఆదివారమున జుక్కల్ మండలకేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే మరియు జిల్లా జడ్పీ చైర్మన్ దఫేదార్ శోభ రాజులతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జుక్కల్ మండల నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు సకాలంలో తప్పకుండా హాజరు కావాలని వారు సూచించారు.




