హైదరాబాద్ సిటీ : యువజన సర్వీసుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కెరియర్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌ను బుధవారం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా యువజన సంక్షేమశాఖాధికారి ఎస్.మోతిలాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల్లో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు కెరియర్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మల్లేపల్లి విజయనగర్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వర్క్‌షాపు ఉంటుందన్నారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన 18-35 ఏళ్ల లోపు వారు కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని తెలిపారు.




