హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బంగారు తల్లి పథకం ఈ రోజు శాసన సభలో ప్రవేశపెటనున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఈ బిల్లును సభలో సమర్పిస్తారు. వీటితో పాటు మరో నాలుగు సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్& కార్పోరేషన్ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లా సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సవరణ బిల్లుతోపాటు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2013లు సభలో చర్చకు రానున్నాయి.




