జనంసాక్షి – హైదరాబాద్‌బ్యూరో:
.అనుమతి కోసం సర్కారుకు విజ్ఞప్తి
.పోలీసులు తమ పని తాము చేస్తారన్న సిఎం
.ముందస్తు అరెస్టులు చేస్తున్నారు: టిజెఎసి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ టిజెఎసి ఇచ్చిన పిలుపుమేరకు గురువారం సడక్‌బంద్ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఇప్పటికే ప్రకటించిన టిఆర్‌ఎస్ బుధవారం శాసనభలో సడక్‌బంద్‌కు అనుమతివ్వాలిని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించడంతోపాటు, సభ కార్యక్రమాలను అడ్డుకుంది. ఈ విషయంలో జోక్యం చేసుకుని అనుమతిప్పించాలని సభలోనే మంత్రి జానారెడ్డికి విజ్ఞప్తి చేశారు. శాసనసభ లాబీల్లో తెలంగాణా ప్రాంత మంత్రులపైన కూడా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం టిఆర్‌ఎస్
సభ్యులు చేశారు. ఒకరిద్దరు మంత్రులను కలిసి సడక్‌బంద్ విషయాన్ని చర్చించారు. విలేకరులతో మాట్లాడుతూ జాతీయరహదారిని ఎ్కడికక్కడ ముట్టడిస్తామని చెప్పారు. టిఆర్‌ఎస్ సభ్యుల ఒత్తిడి నేపథ్యంలో కొందరు మంత్రులు ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్‌రెడ్డిని కలిసి అనుమతికోసం విజ్ఞప్తి చేశారు. మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, డికె అరుణ. శ్రీధర్‌బాబు శాసనసభలోని సిఎం కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. సడక్‌బంద్‌పై ఆయనతో చర్చించిన వారు బందుకు ప్రభుత్వం అనుమతివ్వడం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, వీరి విజ్ఞపిని సిఎం తోసిపుచ్చారు. ఈ తరహా కార్యక్రమాలను సుప్రీం కోర్టు ఇప్పటికే తప్పు పటిందని, ఇటువంటివి నిర్వహించవద్దంటూ తీర్పులిచ్చిందని చెప్పారు.




