నేడు సోంపేట, ఇచ్ఛాపురంలో బంద్
శ్రీకాకుళం: ధర్మల్ ఉద్యమంలో భాగమైన ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ అరెస్టుకు నిరసనగా సోమవారం సోంపేట పట్టణంలో బంద్ నిర్వహిస్తున్నట్లు పట్టణ తెదేపా నాయకులు బీన ఈశ్వరరావు, బీన అనందరావు తదితరులు చెప్పారు. ఎమ్మెల్యేను బేషరతుగా విడుదల చేయాలని కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు డిమాండ్ వ్యక్తం చేశారు. సాయిరాజ్‌ను అరెస్టు చేసి అంపోలు జిల్లా జైలుకు తరలించిన సందర్భంగా ఆయన అక్కడ విలేకర్లతో మాట్లాడారు. ప్రజల కోసం పోరాటాలు చేస్తున్న ప్రజాప్రతినిధి పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం శోచనీయమని ఆయన అన్నారు.



