హైదరాబాద్ : తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో గోదావరిపై వివాదాస్పదంగా మారిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు నేడు మూసుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు బాబ్లీ 14 గేట్ ఈ రోజు ఉదయం మూసివేస్తున్నారు. ఎస్సారెస్పీ ఈఈ రామారావు, బాబ్లీ ప్రాజెక్టు ఈఈ మేస్రం, సీడబ్ల్యూసీ నుంచి ఈఈ శ్రీనివాస్ బెహారీ సమక్షంలో గేట్లు మూసివేయనున్నారు.
నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా బాబ్లీ గ్రామం వద్ద ఈ ప్రాజెక్టును 2.5 టీఎంసీల సామర్థ్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించి 14 గేట్లు బిగించిం ది. నిల్వ సామర్థ్య తక్కువే అయినా వచ్చిన ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు ఎత్తిపోసి తరలించడమే మహారాష్ట్ర వ్యూ హం. దీంతో దిగువన నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎస్సారెస్పీలోకి నీళ్లు రాకపోవడంతో వివాదం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచాలని 2013లో సుప్రీం ఆదేశించింది. నాటి నుంచి ఏటా ఈ తేదీలను పాటిస్తున్నారు.
ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిన ప్రభుత్వం
బాబ్లీ ప్రాజెక్టు పూర్తిమట్టం 346 అడుగులు(2.5 టీఎంసీలు). ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా అడుగంటి పోయింది. జూలై 1న 14 గేట్లు ఎత్తటంతో 0.17 టీఎంసీల నీరు మాత్రమే కిందికి వచ్చింది. ఈ నీరు కందకుర్తి, బాసర మీదుగా ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు చేరడంతో పుష్కరాలు సమయంలో ఉపయోగపడ్డాయి. ఎస్సారెస్పీ పూర్తి సామర్థ్యం 1091అడుగులు(90.31టీఎంసీలు). ప్రస్తుతం 1052.5 అడుగుల (7.57టీఎంసీలు) నీరున్నది. డెడ్‌స్టోరేజీ ఐదు టీఎంసీలుపోగా.. 2.57టీంఎసీల నీటిని తాగునీటికి వినియోగించనున్నారు. ఈ సీజన్లో ఎగువ నుంచి 2.5 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. ఎస్సారెస్పీ కింద 9,48,640 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఎగువన వర్షాలు కురిసి వరద వస్తేనే ఆయకట్టుకు నీదందే అవకాశాలున్నా యి.
రెండేండ్లుగా సాగుకు నీరిచ్చే పరిస్థితి లేకుండాపోయింది. మహారాష్ట్ర బాబ్లీతోపాటు ఎగువన 12ప్రాజెక్టు లు.. ప్రతి వంతెనకు చెక్‌డ్యాంలు నిర్మించటంతో నీరు కిందికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఎస్సారెస్పీపైనే ఆధారపడిన గుత్పా, అలీసాగర్, తద్వారా నిజాంసాగర్ మనుగడ కూడా కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎక్కువగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.




