4జీ సపోర్ట్‌తో అప్పో నియో 7 – రూ.9,990

నియో 7 పేరిట అప్పో సంస్థ తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 ఇంచ్ క్యూహెచ్‌డీ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 540×960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 గిగాహెర్ట్ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 జీపీయూ, 1జీబీ ర్యామ్, 16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 128జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ (మైక్రో+నానో), 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 4.0, 2420 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర సదుపాయాలు ఉన్నాయి. కాంతి తక్కువగా ఉన్న సమయంలోనూ అద్భుతమైన ఫోటోలు తీసుకోగలిగేలా అధునాతన సెల్ఫీ కెమెరాను ఇందులో అమర్చారు. నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో కలర్ ఓఎస్ 2.1 స్కిన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఏర్పాటు చేశారు. ధర రూ.9,990.

293