నెన్నెల, ఏప్రిల్ 10, (జనంసాక్షి )నేతకానీ రక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నెన్నెల మండలం గంగారాం గ్రామానికి చెందిన కామెర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షునిగా జాడి ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షునిగా కామెర ప్రకాష్, ప్రధాన కార్యదర్శి జాడి ఈశ్వర్, కోశాధికారిగా బౌతు రాజ్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా బండారి సురేష్ ఎన్నికయ్యారు. ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కామెర శ్రీనివాస్ మాట్లాడుతూ కుల సర్టిఫికెట్ లో అచ్చు తప్పు సవరించడానికి పోస్ట్ కార్డు ఉద్యమం చేపడుతామన్నారు. రాష్ట్ర రాజధానితో పాటు జిల్లా కేంద్రాల్లో నేతకానీ భవన్ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. నిజమైన నిరుపేదలకు దళిత బంధు ఇవ్వాలని అన్నారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని అన్నారు. పొలాల అమావాస్య పండగను సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.




